
గురుకులాన్ని కొనసాగించాలని ఆందోళన
సిర్పూర్(టి): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను సిర్పూర్(టి)లోనే కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం సిర్పూర్(టి)– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. సిర్పూర్(టి)లో కొనసాగుతున్న గురుకుల పాఠశాల, కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులను ఇతర గురుకులాలకు తరలించడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం సుమారు 4 గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. కౌటాల, కాగజ్‌నగర్ మార్గాల్లో వెళ్లేవారు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులు, విద్యార్థులకు నచ్చజెప్పారు. ధర్నా విరమింపజేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
పడుకుని నిరసన తెలుపుతున్న విద్యార్థులు
రహదారిపై ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు

గురుకులాన్ని కొనసాగించాలని ఆందోళన