వైద్యకళాశాలల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

- - Sakshi

● రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ● కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎమ్మెల్యేలు కోనప్ప, సక్కు, అధికారులు

ఆసిఫాబాద్‌: వైద్యసేవలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యకళాశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబా ద్‌ నుంచి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేసి, వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ జిల్లా కేంద్రం సమీపంలోని అంకుసాపూర్‌ శివారులో నిర్మిస్తు న్న వైద్యకళాశాల భవన ని ర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ మె డికల్‌ కౌన్సిల్‌ జారీ చేసిన నియమాల ప్రకారం సౌకర్యాలు కల్పించేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 60 మంది విద్యార్థినులు, 40 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా వసతులు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఒక్కో బ్లాక్‌కు ఇంజనీరింగ్‌ అధికారి, జిల్లా స్థా యి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించా మని తెలిపారు. ఆరోగ్య మహిళ, కంటి వెలుగు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అలాగే గుండె పోటు మరణాల ను నివారించేందుకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోన ప్ప, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామకృష్ణ, డీసీహెచ్‌ డాక్టర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

వైద్యకళాశాల పనుల్లో వేగం పెంచాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగంగా పెంచాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలోని అంకుసాపూర్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న వైద్యకళాశాలను ఎమ్మెల్యే సక్కుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ మల్లికార్జున్‌, సర్పంచ్‌ బలరాం తదితరులు ఉన్నారు.

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top