చేయూత పెన్షన్ తీసుకుంటున్న వారి ధ్రువీకరణ కోసం ఖమ్మం
కార్పొరేషన్ కార్యాలయంలో ఫేస్ రికగ్నైజేషన్ నిర్వహిస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే పింఛన్‌దారుల్లో దివ్యాంగులకు కనీస సౌకర్యాలు
కల్పించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండలు మండిపోతున్నా
టెంట్లు వేయించపోగా.. వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ఫేస్ రికగ్నైజేషన్‌ను కార్యాలయ వెనుక భాగంలో ఏర్పాటు చేయగా
దివ్యాంగులు మెట్లు ఎక్కి అక్కడకు వెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. కుటుంబీకులు, సహాయకులు దివ్యాంగులకు ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి
నెలకొంది. – ఖమ్మం మయూరిసెంటర్


