ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠా సహిత మహా కుంభాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు. జూలై 3వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల ప్రచార కరపత్రాలు, గోడ పత్రికలను గురువారం మండల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేసి మహా కుంభాభిషేకానికి ఆహ్వానించారు. దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి, ఆలయ ఈఓ కొత్తూరు జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సర్పంచ్ తాళ్లూరి నిర్మలకుమారి పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నుట్లు జిలా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. అగ్రోటెక్ ఇరిటిలైజర్స్ కంపెనీలో 110 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహించనుండగా, 21–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, ఎస్సెస్సీ నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఖమ్మం టీటీడీసీ భవనంలో 30వ తేదీన ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
3నుంచి కబడ్డీ రిఫరీ పరీక్షలు
ఖమ్మం స్పోర్ట్స్: ఆల్‌ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 3నుంచి 11వ తేదీ వరకు దశల వారీగా కబడ్డీ రిఫరీ పరీక్షలు జరగనున్నాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. గతంలో పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి జూన్ 3నుంచి 5వ తేదీ వరకు, కొత్త వారికి 6నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత, 9నుంచి 11వ తేదీ వరకు రెండో విడత పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 1వ తేదీలోగా ఫీజు చెల్లించి హాజరుకావొచ్చని తెలిపారు. వివరాల కోసం బి.అనిల్‌కుమార్ (99498 54610) ను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
ప్రభుత్వ స్థలాల్లోనే ఎస్‌టీపీ ప్లాంట్లు
మధిర: మధిరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు జరుగుతుండగా, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ)ను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈమేరకు ఈఈ రంజిత్‌కుమార్ ఆధ్వర్యాన అధికారులు, మున్సిపల్ డెవలప్‌మెంట్ కమిటీ బాధ్యులు గురువారం పలు స్థలాలను పరిశీలించారు. ఇల్లెందులపాడు, మడుపల్లి, అంబారుపేట సమీపంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించగా నివేదికను కలెక్టర్‌కు పంపించాలని నిర్ణయించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్ ఆర్.రాంబాబుతో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెజవాడ రవిబాబు, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ, మిర్యాల రమణగుప్తా, సిద్ధంశెట్టి సందీప్ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
సత్తుపల్లిలో ఈత పోటీలు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్‌లో గురువారం ఈతపోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 50మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించడమేకాక ఈత వల్ల ఉపయోగాలను నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైకుంఠరావు, కిరణ్, బాబురెడ్డి, అశోక్, కిరణ్, శ్రీహరి, కృష్ణారావు, రామకృష్ణ, నాగేశ్వరరావు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


