ఏడు కేంద్రాల్లో 2,680మంది హాజరు
ఉదయం 11గంటల నుంచే
విద్యార్థులకు అనుమతి
ఆలస్యంగా వచ్చిన వారికి
అనుమతి నిరాకరణ
ప్రతిభ కనబరుస్తా
బయాలజీ సులువు..
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) జిల్లాలో
ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ఈమేరకు 2,762మంది విద్యార్థులకు గాను 2,680 మంది హాజరుకాగా 82మంది గైర్హాజరయ్యారని జిల్లా నోడల్ అధికారి నరేందర్ వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్
ఖమ్మం క్రైం: నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించారు. ఖమ్మంలోని శాంతినగర్ కాలేజీ, కేంద్రియ విద్యాలయంను సందర్శించిన ఆయన బందోబస్తుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.
11గంటల నుంచే అనుమతి
నీట్ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరగగా విద్యార్థులను ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 10–30గంటలకల్లా చేరుకున్నారు. ఈమేరకు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక అనుమతించారు. కాగా, కేంద్రాల్లోని మధ్యాహ్నం 1–30గంటల తర్వా త అనుమతించేది లేదని ముందుగానే అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు చాలా మంది ముందుగానే వచ్చినా కొందరు మాత్రం హడావుడిగా చేరుకున్నారు. ఇంకొందరు ఆభరణాలు, షూ ధరించి రావడంతో వాటిని తీసివేశాకే లోనకు అనుమతించారు. మరికొందరు ఫొటోలు తీసుకురాకపోవడంతో సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలకు బంధువులు పరుగులు తీశారు. ఒకరిద్దరు 1–30గంటల తర్వాత రాగా వారిని అనుమతించలేదు.
నీట్‌లో మంచి మార్కులతో అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది. బయాలజీ ప్రశ్నలు ఈజీగా రాశా. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పలు క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. అయినా నేర్చుకున్న అంశాలకు దగ్గరగా ఉండడంతో బాగానే రాశాను.
– గుండ్ల రుచిత ఐశ్వర్య, ఖమ్మం
నీట్ మంచిగా రాశా. ప్రశ్నాపత్రంలో బయాలజీ సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రశ్నలు సులభంగా వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అయినా బాగానే రాశాను. మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది.
– ఏపూరి ప్రేరణ, ఖమ్మం


