రాజకీయాలకు తావు లేకుండా
అర్హులందరికీ పథకాలు
ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించేలా ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించా రు. ఇదే సమయాన రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపా రు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాలనను ప్రజల గడప వద్దకే తీసుకొస్తున్నామని తెలిపారు. మండలాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లలో అందిన ప్రతీ దరఖా స్తును రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని తెలిపారు. సాదా బైనామా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.
గత ప్రభుత్వ తీరుతోనే...
ప్రజాదర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని, గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. దీన్ని బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే..
తిరుమలాయపాలెం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకా లు అమలు చేయడమే కాక ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రజాదర్బార్ జరుగుతుండగానే బచ్చోడులో గాలి దుమా రంతో కూడిన వర్షం మొదలైంది. అయితే, పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలు నిరాశ చెందకుండా పాఠశాల వరండాలో మంత్రి, కలెక్టర్ కూర్చుని దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


