నేలకొండపల్లి: వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఈ సమయాన ఖమ్మం నుంచి గ్రామానికి వచ్చిన బస్సు శివార్లలో అదుపు తప్పగా పొలాల్లోకి దిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా ఎవరికీ గాయాలు కాలేదు. ఈమేరకు సమాచారం అందుకున్న సర్పంచ్ ధీరావత్ అశోక్‌రాణి, ధీరావత్ రాధాకృష్ణమూర్తి తదిరతులు చేరుకుని జోరు వర్షం కురుస్తుండగా చీకట్లో సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడు జేసీబీని రప్పించి బస్సును బయటకు లాగి రోడ్డుపైకి చేర్చారు. అంతేకాక రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తృటిలో తప్పిన ప్రమాదం


