నిప్పుల కొలిమి.. | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి..

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

ఈ వారమంతా 41 – 45 డిగ్రీల మధ్య భానుడి ప్రతాపం

సీజన్‌లోనే శుక్రవారం

అత్యధిక ఉష్ణోగ్రత

పమ్మిలో 45.1,

గుబ్బగుర్తిలో 45 డిగ్రీలుగా నమోదు

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ సమ్మర్‌.. వెరీహాట్‌

ఈ వేసవిలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ప్రతీ వేసవిలో సాధారణంగా ఏప్రిల్‌ నుంచి ఎండలు పెరుగుతూ మే నెలలో గరిష్టస్థాయికి చేరతాయి. కానీ ఈసారి మాత్రం మార్చి నుంచే ప్రభావం మొదలై ఏప్రిల్‌ 20వ తేదీ నాటికి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. బయటకు వచ్చే పరిస్థితి లేకపోగా, ఇంట్లోనూ విపరీతమైన వేడితో జనం అవస్థ పడుతున్నారు.

అటు ఎండ.. ఇటు ఉక్కపోత

ఈసారి ఎండలకు తోడు ఉక్కపోత ఎక్కువగా ఉంది. బయటకు వచ్చిన నిమిషాల్లోనే చెమటలు పడుతూ ఒకచోట ఉండలేని పరిస్థితి ఎదురవుతోంది. పది రోజుల నుంచి ఎండల ప్రభావం మరింతగా పెరగగా, ఉదయం 7గంటలకే మొదలై 9గంటలకల్లా ఉధృత రూపం దాలుస్తోంది. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. వేడిగాలులు, సెగలతో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు.

మరింతగా ౖపైపెకి..

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మే నెలలో వడగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. అడపాదడపా వర్షాలు పడినా.. ఆ తర్వాత ఉక్కపోత, ఎండ మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. దీంతో మే నెల ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రెడ్‌జోన్‌లోకి..

వాతావారణ శాఖ ఉష్ణోగ్రతల తీవ్రతను నాలుగు రకాలుగా విభజిస్తుంది. 35 – 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైతే గ్రీన్‌, ఎల్లో రేంజ్‌గా ప్రకటిస్తారు. ఇక 40 – 45 వరకు ఆరెంజ్‌ అలెర్ట్‌, 45 డిగ్రీల పైన నమోదైతే రెడ్‌ జోన్‌గా నిర్ధారిస్తారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో శుక్రవారం 45డిగ్రీలు దాటడంతో రెడ్‌ అలర్ట్‌లోకి వెళ్లినట్లయింది. ఇక మిగతా వెదర్‌ స్టేషన్ల పరిధిలోనూ 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనేపథ్యాన ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా యంత్రాగం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ మధ్య నిర్మానుష్యంగా మారిన బైపాస్‌ రోడ్డు

జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం పెరుగుతుండడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దీంతో వేడి సెగలతో వృద్ధులు, పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారు

అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండ ప్రభావం గరిష్టస్థాయికి చేరి బయటకు రాలేని పరిస్థితి

ఉంటోంది. పలు ప్రాంతాల్లో 41 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత

నమోదవుతుండడం గమనార్హం. ఇక శుక్రవారం పమ్మిలో 45.1 డిగ్రీలు, గుబ్బగుర్తిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని చెబుతున్నారు.

– సాక్షి ప్రతినిధి, ఖమ్మం

జిల్లాలో నానాటికీ

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఎండతో పాటు వేడిగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమయాన పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవాలి. ఉదయం 11లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయటి పనులు చూసుకుంటే మేలు. వేడిని తట్టుకోవడానికి ఎక్కువగా నీళ్లు తాగాలి. వడదెబ్బ బారిన పడితే డీహైడ్రేషన్‌కి గురవడమే కాక ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. శరీరంలో సోడియం, పొటాషియం దెబ్బతినకుండా ఓఆర్‌ఎస్‌ తాగాలి. ఎవరైనా వడదెబ్బ బారిన పడినట్లు గుర్తించగానే తక్షణమే ఆస్పత్రికి తరలించాలి.

– డాక్టర్‌ డి.నారాయణమూర్తి,

వెల్‌నెస్‌ సెంటర్‌ స్పెషలిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement