ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం వైరారోడ్: మే డే వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యాన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించగా.. వాడవాడలా అరుణ పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు హక్కులు సాధనకు పోరాడాలని పిలుపునిచ్చార.
●సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నెహ్రూనగర్‌లోని పాత పార్టీ కార్యాలయం నుండి పెవిలియన్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడారు. నాయకులు మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, జానిమియా, మహ్మద్ సలాం, శింగు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కార్యాలయంలో పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి సురేష్ ఎగురవేశారు.
●సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, టీయూసీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జెండాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆవిష్కరించి మాట్లాడారు. టీయూసీఐ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, నాయకులు శోభ, భరత్, లక్ష్మ ణ్, కె.శ్రీనివాస్, పాల్గొన్నారు. అలాగే, మాస్‌లైన్ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించగా నాయకులు ఆవుల అశోక్, ఝాన్సీ, చంటి, చందు పాల్గొన్నారు.
●ఖమ్మం కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు జెండా ఎగురవేసి మాట్లాడారు. అలాగే, సీపీఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మేడే జెండాను ఆవిష్కరించగా నాయకులు పాల్గొన్నారు.
●పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ కార్మికుల పక్షపాతిగా నిలిచారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం రైతు బజార్ ఆటో అడ్డా వద్ద బీఆర్‌టీయూ ఆధ్వర్యాన ఆయన సంఘం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, కార్పొరేటర్ జ్యోతిరెడ్డితో పాటు పాషా, సత్తార్, బిక్కసాని జస్వంత్, ఖమర్, తాజుద్దీన్, బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణకు పోరాడాలని పిలుపు


