సాంకేతికతను అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్‌ నేరగాళ్లు బలమైన నెట్‌వర్క్‌ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యాన పాత నేరస్తులు, రౌడీషీటర్ల మాదిరిగానే సై | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతను అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్‌ నేరగాళ్లు బలమైన నెట్‌వర్క్‌ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యాన పాత నేరస్తులు, రౌడీషీటర్ల మాదిరిగానే సై

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

వీరిపైనే కేసులు..

మళ్లీమళ్లీ నేరాలు చేయకుండా పోలీసు శాఖ ప్రత్యేక వ్యూహం ప్రతీ కదలికపై నిరంతరం నిఘా వేసేలా చర్యలు నేరాలకు పాల్పడిన వారిపై సస్పెక్ట్‌ షీట్లు

సైబర్‌ నేరగాళ్లపై

నిఘా

జిల్లాపై పంజా

జిల్లాలో పలువురు సైబర్‌ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. లాటరీ వచ్చిందని, బ్యాంక్‌లో నగదు జమ అయిందని ఓటీపీ అడుగుతూ అకౌంట్ల నుంచి డబ్బు కాజేయడమే కాక, ఇతర రూపాల్లో సైబర్‌ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ ముఠా అంతర్జాతీయ స్థాయిలో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ రూ.547 కోట్ల మేరకు లావాదేవీలు జరపడం షాక్‌కు గురి చేసింది. ఈ ముఠా అంతర్జాతీయ సైబర్‌ క్రైమ్‌ నేరస్తులతో జత కలిసి విదేశాల్లో కాల్‌ సెంటర్లు నిర్వహించినట్లు తేలింది. మ్యాట్రిమోనీ, రివార్డ్‌ పాయింట్లు, గేమింగ్‌, బెట్టింగ్‌, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ ఇలా వివిధ రూపాల్లో నిందితులు ప్రజలను మోసగించారు. అంతేకాక స్థానికులతో ఖాతాలు తెరిపించి, వాటి ఆధారంగా లావాదేవీలు జరపడంతో అమాయకులు కేసుల పాలయ్యారు.

నేరగాళ్లపై ‘సస్పెక్ట్‌’ అస్త్రం

సైబర్‌ నేరాల కింద కేసులు నమోదైన వారిపై పోలీసులు సస్పెక్ట్‌ షీట్‌ తెరవనున్నట్లు తెలిసింది. ఈ తరహాల నేరాలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సైబర్‌ నేరాలకు పాల్పడే వ్యక్తులు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్లీ మోసాలకు పాల్పకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సస్పెక్ట్‌ షీట్‌ తెరిచి.. వారి నివాసాల వద్ద ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించడమే కాకుండా బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిసింది. అంతేకాక నేరగాళ్ల ఫొటో, చిరునామా, వారు గతంలో చేసిన నేరాల తీరు, కేసుల స్థితిగతుల సమాచారాన్ని ఈ షీట్‌లో పొందుపరుస్తారు. నిందితుల నివాసం ఉన్న పోలీసు స్టేషన్‌ అధికారుల వద్ద ఈ వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. తద్వారా అధికారులు మారినప్పటికీ నిఘా మాత్రం నిరంతరం కొనసాగనుంది.

నిరంతర పరిశీలన

ఒకసారి సస్పెక్ట్‌ షీట్‌ నమోదైతే.. సదరు వ్యక్తి పోలీసుల నిఘా నేత్రంలోకి వచ్చినట్టే. నిందితులు నేరస్తుడు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే ఆ సమాచారం స్థానిక పోలీసులకు చేరుతుంది. ఆపై బీట్‌ కానిస్టేబుళ్లు, గస్తీ బృందాలు, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు వారిపై నిఘా పెంచుతారు. నేరస్తుల ప్రతి చర్యను గమనిస్తూ మళ్లీ ఏమైనా నేరాలకు పాల్పడుతున్నారా అని పరిశీలిస్తుంటారు. ఏమైనా అనుమానాస్పద కదలికలు నమోదైతే మరింత అప్రమత్తమై పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు.

వెబ్‌సైట్లలో వివరాలు

సైబర్‌ నేరగాళ్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లకే పరిమితం చేయకుండా.. ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. నేరగాళ్ల వివరాలు తెలిసేలా పోలీసు శాఖ, ఇతర వెబ్‌సైట్లలో పొందుపర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా స్థానికులు కూడా వారి విషయంలో అప్రమత్తంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, సైబర్‌ నేరాల కట్టడి పోలీసులతో మాత్రమే సాధ్యం కాదని.. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠాకు జిల్లాలోని సత్తుపల్లి ప్రాంత వాసులు పలువురితో లింక్‌లు ఉన్నట్లు పోలీసు విచారణలో

తేలింది. ఇందులో ఉడతనేని వికాస్‌చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామవెంకట చరణ్‌, పోట్రు మనోజ్‌కల్యాణ్‌, మేడా

భానుప్రియ, మేడా సతీష్‌కుమార్‌, బొప్పన నాగప్రసాద్‌, పోట్రు ప్రవీణ్‌, జుంజునూరి శివకృష్ణ, జొన్నాదుల తిరుమలసాయి

తదితరులపై కేసుల నమోదయ్యాయి.

వీరంతా రూ.కోట్ల లావాదేవీలకు సంబంధించి కేసుల్లో నిందితులు కాగా, మరికొందరు సైబర్‌ నేరాలు చేస్తూ పట్టుపడ్డారు.

సాంకేతికత ఆధారంగా రూ.కోట్లు కొల్లగొడుతున్న మాయగాళ్లు

Advertisement
 
Advertisement
Advertisement