మధిర: మధిర లడకబజార్‌లోని తన ఇంటి ముందు మెట్లను మున్సిపల్ సిబ్బంది అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వల్లాపురపు జానకిరామయ్య కుటుంబీకులు నిరసన తెలిపారు. ఆయన భార్య నాగరాణి, ఆమె సోదరుడు బాలాజీ, కుటుంబీకులు మంగళవారం రైల్వే గేట్ సమీపాన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగరాణి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా జరిగిన పెనుగులాటలో బాలాజీ చేతికి గాయమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా పట్టించుకోకుండా, తమ ఇంటి ముందు మెట్లను మాత్రం ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారని ఆరోపించారు. కమిషనర్ తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు.
మున్సిపల్ సిబ్బంది మెట్లు కూల్చారని ఆవేదన


