ప్రైవేట్‌ కాలేజీల విద్యార్థుల సత్తా.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ కాలేజీల విద్యార్థుల సత్తా..

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

శ్రీ చైతన్య జయభేరి న్యూవిజన్‌ విజయదుందుభి హార్వెస్ట్‌ విజయభేరి

ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని పలు ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలోనే అగ్రస్థానాన నిలిచారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలను వెల్లడించిన కళాశాలల యజమాన్యాలు విద్యార్థులను అభినందించారు. – ఖమ్మం సహకారనగర్‌

ఇంటర్‌లో ఉత్తమ మార్కులతో రాష్ట్రస్థాయి ప్రతిభ

ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జయభేరి మోగించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. సీనియర్‌ బైపీసీలో వేయి మార్కులకు 997 మార్కులతో కె.జ్యోత్స్న, ఎంపీసీలో 996 మార్కులతో పి.ప్రియలక్ష్మి 996 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే, మొదటి సంవత్సరం బైపీసీలో 440కి 438మార్కులతో ఇద్దరు, ఎంఈసీలో 500కి 496మార్కులతో స్టేట్‌ టాపర్‌గా నిలిచారన్నారు. అంతేకాక సీనియర్‌ ఎంపీసీలో ఎం.డీ.జారా మహిక్‌, జి.హర్షిణి, ఎన్‌.సూర్యప్రకాష్‌ 995, జి.తన్మయి, జి.భావన, ఎం.శ్రీఉజ్వల, కె.యశస్విని, ఎం.నిహారిక 994, సీహెచ్‌.రిషిత సాయిశ్రీ, వి.కీర్తి, వై.భరత్‌ తేజ, ఎం.సింధు, ఎస్‌.బిందు వర్షిణి లక్ష్మీసాయి, బి.నిహారిక, వై.సాయి షాన్విక, ఎస్‌.నౌషిన్‌, పి.సాయి కీర్తన 993 మార్కులు సాధించారన్నారు. జి.విజయాంజలి 992, కె.గాయత్రి 991, ఎన్‌.ఆకాంక్ష 989, బి.అపూర్వ, జి.జాన్‌ విశిష్ట, జి.నవ్య 988, ఈ.ఎవన్‌గ్లీన్‌ 987, ఎస్‌.హర్షిత, ఏ.అశ్విత, బి.తేజస్విని, బి.స్రవంతి, ఎన్‌.శ్రేష్ఠ, ఐ.ప్రియాంకలు 985మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్‌ ఎంపీసీలో బి.రాజ్‌ వర్థన్‌ వర్మ, జి.నాగమల్లేశ్వరి, ఎన్‌.తన్మయిసాయి, జి.హిమశ్రీ, జె.తిలోషా, ఎం.సాయి హర్షిణి, వై.విమరత, ఏ.గగన్య, కె.సంధ్య, ఎం.దేవతి, ఎన్‌.గయా, డి.త్రిష, కె.సాత్విక 468మార్కులు, బైపీసీలో వి.ఛాయశ్రీ 438, జి.శ్రీజ 438, బి.మమత 437, ఎస్‌కే.అమోతు షుకర హాసిరా 437, ఎస్‌.నందిని, బి.అనూష, బి.వాసవి, ఎస్‌.లక్ష్మీసంజన, కె.నాగ లోకేష్‌రెడ్డి 436, బి.యశస్విని, సీహెచ్‌.సుస్మిత, వి.శ్రియ, ఆర్‌.వర్షిణిశ్రీ ప్రియ, వి.యోజిత, ఏ.సంజన, ఎం.గణేశ్వరి, జె.లావణ్య, కె.రక్షిత అత్యధిక మార్కులు సాధించారన్నారు. జూనియర్‌ ఎంఈసీలో బి.నందునాయక్‌ 496, ఎస్‌.సాయి శ్రీ వర్థన్‌ 489, ఎస్‌.మనస్వితరెడ్డి 484, కె.నందు 481మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్‌, డైరెక్టర్‌తో పాటు అకడమిక్‌ డైరెక్టర్లు బి.సాయిగీతిక, డీజీఎం చేతన్‌ మాదూర్‌, ఎగ్జిక్యూటివ్‌ డీన్‌ ఎన్‌ఆర్‌ఎస్‌డీ.వర్మ, డీన్‌ జె.కృష్ణ, ఏజిఎంలు సీహెచ్‌.బ్రహ్మం, ప్రకాష్‌, గోపాలకృష్ణ అభినందించారు.

ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని న్యూవిజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సీహెచ్‌జీకే.ప్రసాద్‌ తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించిన ఆయన వివరాలు వెల్లడించారు. జూనియర్‌ ఎంపీసీలో 470కి ఏడుగురు విద్యార్ధులు 468మార్కులు, బైపీసీలో 440కి 438, సీనియర్‌ ఎంపీసీలో వేయికి 994మార్కులు, బైపీసీలో వేయికి 991మార్కులతో అగ్రస్థానాన నిలిచారన్నారు. జూనియర్‌ ఎంపీసీలో బి.రాఘవ, ఎన్‌.తనుశ్రీ, ఎస్‌.కే.నైమా, టి.లాస్యశ్రీ, బి.కనితచౌదరి, బి.శిల్ప, టి.తేజశ్రీ 468మార్కులు, కె.తన్వి, ఎం.సాత్విక్‌, ఎ.స్వర్షశ్రీ, డి.హాసినిరెడ్డి, కె.ఆశ్రిత, ఎన్‌.యువన్‌ సూర్య, ఎన్‌.జతిన్‌, పి.చాహ్న, ఎస్‌.కే.రిహా తంజీన్‌, ఎన్‌.భవ్యశ్రీ 467మార్కులు, జూనియర్‌ బైపీసీలో వి.శివశ్రీ, డి.అక్షిత 438మార్కులు, ఏ.నిహారిక, డి.మహీ 437, ఐ.సాత్విక, డి.దేవశ్రీ, పి.తేజశ్రీ 436మార్కులు సాధించారన్నారు. అలాగే, సీనియర్‌ ఎంపీసీలో జి.చిన్మయిశ్రీ 994మార్కులు, ఎస్‌.గౌరినందన్‌రెడ్డి, కె.నేహశ్రీ, జి.అభినాష్‌, ఎస్‌.కే.సమీర్‌, యు.శృతి 993, పి.సాత్విక, కె.ప్రకీర్తి 992, సీనియర్‌ బైపీసీలో ఎం.ఇనాస్‌ 991, కె.గుణశేషు 989, బి.శశాంక్‌ 989, కె.ఆరోణ్‌ నిహాల్‌రాయ్‌ 989, ఏ విద్యశ్రీ 989, ఎ.నూర్‌ నాఫియా 989, ఎం.రోషిణి 986, బి.ఆశ్రిత 983, కె.తేజయాదవ్‌ 983, గోమతి 982, జి.ప్రణీత్‌ 982, జి.శ్రీవెంకటనాగకోమలి 982, బి.హిమ 982 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ సీ.హెచ్‌.కార్తీక్‌, సీ.హెచ్‌.గోపిచంద్‌, డీన్‌ శ్రీధర్‌, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు అభినందించారు.

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయభేరి మోగించారని హార్వెస్ట్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌ పార్వతిరెడ్డి తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి. నీరజ్‌ 467మార్కులు, ఎస్‌.కే.లాల్బి 467, బి.సాత్వికప్రియ 466. ఎం.సాయిదుర్గ 466, ఎస్‌.కే.మనా తన్వీర్‌ 465, ఏ.అక్షయ్‌ 465, టీ.బీ.నరసింహ 465, బి.కార్తికారెడ్డి 464, ఒ.రిషిలక్ష్మణ్‌ 464, ఎం.రేవంత్‌కుమార్‌ 464, ఏ.కుమార్‌ నాయక్‌ 464, టి.హారిక 464, కె.తనుష్క 464 మార్కులు సాధించారన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ నుంచి కె.రుచిత 993 మార్కులు సాధించగా, యామిని 992, ఏ.శ్రీకళ 991, జి.కౌసల్య 989, వి.కీర్తిరెడ్డి 988, జి.ప్రణతి 987, జి.శ్రావణ్‌కుమార్‌ 986, ఎన్‌.సిరిసాన్వి 985, షేక్‌ మహబూబ్‌ పాషా 985, వై.యశ్వంత్‌ 984, పి.సంజయ్‌ రామస్వామి 984, జి.సమిత్‌ 982, జి.యశ్మిత 982, పీ.జే.రాఘవచౌదరి 982 మార్కులు సాధించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement