ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470మార్కులకు జె.సాహితి 467, షేక్.మదార్ సాహెబ్, షేక్.నుజాహత్ ఆయేషా, వి.తేజశ్రీ 467మార్కులు, షేక్ జవేదా జీరాబేగం, బి.క్రాంతి చరిత, వై.హాసిని, కె.జోషిత, ఎం.తీర్థ శ్రీ వెన్నెల, సీహెచ్.గణేష్, ఆరుబా జైనాబ్ 466మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440మార్కులకు షేక్ ఉమ్మె సాల్మ, జోషిక 437మార్కులు, వి.గీతిక శ్రీ 436, ఎం.డీ.అబేద్ 436, కె.తేజిత 434, డి.తరుణ్ 432, పి.భరత్ సంజయ్ 431, కె.నవ్య శ్రీ దుర్గేశ్వరి, వి.శివనాగేశ్వరి, ఎం.డీ.సుహానా 430మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు ఎం.మన్విత 994మార్కులు, వి.తన్మయి 992, బి.వెంకట శ్రీవర్షిత 992, డి.హారిక, ఏ.హాసిని, ఏ.వర్షిణి 990మార్కులు సాధించారన్నారు. బైపీసీలో షేక్ తరున్నం ఫర్హీన్ 989, కె.హారిక రెడ్డి 988, బి.దివ్య శ్రీ 977, ఎం.ధరణి 977, కె.వర్షిత 972మార్కులు సాధించగా డైరెక్టర్లతో పాటు ప్రిన్సిపాళ్లు వి.సతీష్, భాస్కర్‌రెడ్డి అధ్యాపకులు అభినందించారు.


