ఎస్‌ఆర్‌కు టాప్‌ మార్కులు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌కు టాప్‌ మార్కులు

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

ఎస్‌ఆర్‌కు టాప్‌ మార్కులు

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు టాప్‌మార్కులతో ప్రభంజనం సృష్టించారని ఎస్‌ఆర్‌ కళాశాల చైర్మన్‌ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ఏ ఊహిత, ఎన్‌.గీత, కె.రేణుక, ఓ.జోష్ణ, షేక్‌ అస్మా, ఎం.వర్షిత, ఇ.లిఖిన్‌ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో 440 మార్కులకు పి.హేమబిందు 438, డి.యోగిత 437, పి.ప్రియాంక 437, ఎం.వరూధిని, షేక్‌ ఖాజిమ్‌ థౌసిఫ్‌ 436, జి.వర్షిత 435మార్కులు సాధించారని తెలిపారు. ఇక ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వేయి మార్కులకు కె.రోహిణి 996, బి.ప్రశాంతిక రమ్య 995, సీహెచ్‌.సాత్విక్‌, డి.పూజిత 994, బైపీసీలో ఎన్‌.మేధ, పి.అనన్య 990 మార్కులు సాధించారన్నారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌, సీఈఓ సురేందర్‌రెడ్డి, డీజీఎం గోవర్దన్‌రెడ్డి, చీఫ్‌ జోనల్‌ సదన్‌రావు, జోనల్‌ ఇన్‌చార్జ్‌ విజయభాస్కర్‌రెడ్డి, డీన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్‌, శ్రీనివాస్‌, సుధాకర్‌, బ్రహ్మం అభినందించారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్‌, మాచవరపు కోటేశ్వరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో వేయి మార్కులకు కె.కావ్యకళ 995, ఎన్‌.చందన 995, ఎస్‌.నవదీప్‌ 994, వి.గణేష్‌ 994, బైపీసీలో జి.ప్రహర్ష 994, బి.సాయి కీర్తన 992, జేఎల్‌ఎస్‌.మైత్రేయి 990, జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు బి.ఉదయ్‌కిరణ్‌, సీహెచ్‌.భావన, యు.వీ.ప్రణవి 468, లోహితశ్రీ, ఎం.శ్రావ్య సాత్విక, పి.హవీల, కె.జ్యోత్స్న, ఆర్‌. మనీష, ఎస్‌.నందిని, కె.పల్లవి శ్రీదుర్గ 467, బైపీసీలో 440 మార్కులు ఎల్‌.లోకేష్‌, సీహెచ్‌.ప్రశాంత్‌ 437, బి.సమత, జి.అఖిల, బి.జెస్సికా 436, నౌషీన్‌, బి.శ్రావణి, నిహారిక, పి.రిత్విక్‌రెడ్డి 435, ఎంఈసీలో 500 మార్కులకు ఆర్‌.దీపిక శరణ్య 496, సీఈసీలో 500 మార్కులకు గీతిక 489, జయేని 488 మార్కులు సాధించారని తెలిపారు. వీరిని డైరెక్టర్లతో పాటు డీన్‌ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌, హెచ్‌ఓడీలు లక్ష్మణ్‌, రాజశేఖర్‌రెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement