దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షలకు.. | - | Sakshi
Sakshi News home page

దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్షలకు..

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్‌ పరీక్షలకు సిద్ధమవుతుండగానే తండ్రి మృతి చెందాడు. అయినా ఆ విద్యార్థిని దుఃఖాన్ని దిగుమింగుకుని పరీక్షలు రాసి సత్తా చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన గుంటి ప్రహర్ష ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె తండ్రి, ఆటోడ్రైవర్‌ శ్రీను మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

ఈక్రమాన ప్రహర్షకు కళాశాల యజమాన్యం, అధ్యాపకులు ధైర్యం చెప్పడంతో పరీక్షలు రాసి వేయి మార్కులకు 994 మార్కులు సాధించడం విశేషం.

చిరుద్యోగి కుమార్తె

వైరా: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చిరుద్యోగి కుమార్తె అత్యధిక మార్కులు సాధించింది. కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సంతోష్‌ కూతురు సాత్విక వైరాలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదివించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమె 991 మార్కులు సాధించగా పలువురు అభినందించారు.

994మార్కులు సాధించిన విద్యార్థిని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement