షార్ట్ సర్క్యూట్‌తో.. రూ.50 వేల ఆస్తినష్టం
ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు
రఘునాథపాలెం: కూలి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తికి ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాంకుడోతు అమరయ్య పొలంలో పెసలు తూర్పాల పట్టేందుకు కూలి పనులకు వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ ఫ్యాన్ రెక్కలు అతని కుడి చేతి భుజానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 108లో ఖమ్మానికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
సత్తుపల్లిరూరల్: ఇంట్లోని వారంతా డాబాపై నిద్రిస్తున్న సమయాన ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. వివరాలిలా.. సత్తుపల్లి మండలం బేతుపల్లి ఎస్టీ కాలనీలో శనివారం అర్ధరాత్రి వడ్డంగి అశోక్ తన కుటుంబంతో డాబాపై నిద్రిస్తున్నాడు. ఈక్రమాన అర్ధరాత్రి దాటాక కాలిన వాసన వస్తుండడంతో కిందకు వెళ్లి చూడగా.. ఇంట్లో నుంచి మంటలు వస్తుండడంతో డోర్లు తీసి మంటలను అదుపు చేశారు. ఈక్రమాన వంట గదితో షార్ట్ సర్క్యూట్ అయి ఫ్రిజ్, గ్రైండర్, మిక్సీ, టీవీ, ఫ్యాన్లు, విద్యుత్ బోర్డులన్నీ కాలిపోయాయని, గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు వాపోయారు. ఈక్రమంలో బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకోగా సుమారు రూ.50వేల ఆస్థినష్టం వాటిల్లినట్లు బాధితుడు వివరించాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు.
నేలకొండపల్లి: శ్రీరామనవమి సందర్భంగా నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపా రు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగే ఈ పోటీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డిలు ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి బహుమతి రూ.20,016, రెండో బహుమతి రూ.15,016, మూడో బహుమతి రూ.10,016, నాల్గవ బహుమతి రూ.8,016, ఐదో బహుమతి రూ.5,016 నగదుతో పాటు షీల్డ్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 78936 94778, 99638 66092లను సంప్రదించాలని కోరారు.


