ఇకపై ఆ ట్యాక్స్‌ రద్దు.. | - | Sakshi
Sakshi News home page

ఇకపై ఆ ట్యాక్స్‌ రద్దు..

Mar 23 2026 8:48 AM | Updated on Mar 23 2026 8:48 AM

రెండో వాహనం కొనుగోలుపై

అదనపు ట్యాక్స్‌ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని

వాహన్‌ పోర్టల్‌

నేటి నుంచి అమల్లోకి..

ఖమ్మంక్రైం: ఏదైనా వాహనదారుడికి అతడి పేరుపై ఆర్‌సీ కార్డు కలిగి ఉండి అతడు మరో వాహనం కొనాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా రెండుశాతం అదనంగా లైఫ్‌ట్యాక్స్‌ కట్టాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ట్యాక్స్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులకు ఊరట కల్గించినట్లయింది. ఇది నేడు(సోమవారం) నుంచి అమల్లోకి రానుండడంతోటూ,త్రీ, ఫోర్‌ వీలర్స్‌ ఏదైనా కొనుగోలు చేసినా అదనపు ట్యాక్స్‌ ఉండదు.

ఈవీల రాకతో..

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్‌ను చక్కదిద్దే క్రమంలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోళ్లను కంట్రోల్‌ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అదనపు ట్యాక్స్‌ అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్యాక్స్‌ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలకాలంలో వాహనదారులు ఎలక్ట్రికల్‌ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో కాలు ష్యాన్ని నివారించడానికి ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోవాహనాల కొనుగోళ్లు మరింత పెరిగేఅవకాశం ఉంది. ఈక్రమాన జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం 100కు పైగా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఇటీవలకాలంలో షోరూమ్స్‌లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో వాహనదారులు షోరూమ్‌కు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుండడం గమనార్హం.

కేంద్ర వాహన్‌ పోర్టల్‌లోకి..

తెలంగాణ రవాణాశాఖ ఈనెల23నుంచి జిల్లా రవాణా శాఖ పరిధిలోని వాహనాల డేటాను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వాహన్‌ పోర్టల్‌లోకి చేరవేయనుంది. నేషనల్‌ డేటాబేస్‌తో అనుసంధానం చేయడం ద్వారా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ఈజీ అవుతుంది. అదేవిధంగా సెకండ్‌హ్యాండ్‌ వాహనాల కొనుగోలు విషయంలో జరిగే మోసాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా దొంగ వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్‌ పడే అవకాశం ఉంది.

పెరగనున్న పారదర్శకత..

ఈ వాహన్‌ పోర్టల్‌ డిజిటల్‌ విధానంతో రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడంతో పాటు ఏజెంట్ల జోక్యం తగ్గి వాహనదారుడికి రవాణా సేవలు వేగంగా అందుతాయి. అంతేకాక ఆర్సీ డూప్లికేట్‌ కాపీ, పేరు, చిరునామా మార్పు, లోన్‌ తొలగింపు వంటిసేవలను నేరుగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవ చ్చు. ఫలితంగా ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన పనిలేకపోవడంతో పాటు వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. డిజిటల్‌ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో భద్రపర్చుకోవచ్చని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.

వాహనదారులకు లైఫ్‌ట్యాక్స్‌ నుంచి ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement