ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్‌..

Mar 23 2026 8:48 AM | Updated on Mar 23 2026 8:48 AM

ఖమ్మంవైరారోడ్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ, అప్పుల ఊబి లోకి నెట్టేలా బడ్జెట్‌ రూపుదిద్దుకుందన్నారు. ఆది వారం బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో రూ. 2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నర ఏళ్లల్లోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలకు ప్రయోజనం లేకుండా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. నిధుల మళ్లింపు, సింగరేణి ఫండ్స్‌ డైవర్షన్‌, భూముల తాకట్టుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు పునరుద్ధరించిన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతు భరోసా, మహాలకి్‌ష్మ్‌ పథకం, నిరుద్యోగ భృతి హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌, పగడాల నాగరాజు, ఉన్నం బ్రహ్మ య్య, వేముల వీరయ్య, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement