రఘునాథపాలెం: నీటి సంరక్షణకు అందరూ కృషి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి అన్నారు. జల మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ జల్’లో భాగంగా మండలంలోని రేగులచలకలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. అమూల్య వనరైన నీటిని వృథా చేయొద్దని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహిచారు. నీటిని సంరక్షిస్తూ బాధ్యతగా వినియోగిస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, డీఈ ఓంప్రకాష్, ఏఈ ఇందిరా జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు యండపల్లి రమాదేవి, బలుసుపాటి శేషయ్య, కొటేరు నర్సిరెడ్డి, నున్నా వెంకటేశ్వరరావు, మాదంశెట్టి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి ఆదాం, ఉపాధి హమీ పథకం ఏపీఓ పద్మయ్యనాయుడు, డీఆర్‌ఓ వి.సల్మాన్‌రాజు పాల్గొన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి


