మధిర: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలెలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. మరింత నాణ్యమైన సేవలు అందేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. వైద్యుల హాజరు వివరాలను రెగ్యులర్‌గా తనకు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తేనే ఎక్కువ మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారని తెలిపారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్ వెంట మధిర తహసీల్దార్ రాంబాబు, తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అనుదీప్ హెచ్చరిక


