సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించాలి

Mar 23 2026 8:47 AM | Updated on Mar 23 2026 8:47 AM

చింతకాని : పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. నాగులవంచ రైతువేదికలో ఆదివారం వరి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా విత్తుకునే వరి సాగుతో ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ విధానంలో పాటించాల్సిన పద్ధతులు, కలుపు యాజమాన్యం, ఎరువులు, మందుల వాడకంపై వివరించారు. రైతులు పామాయిల్‌ సాగుపై కూడా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ స్వర్ణ విజయ్‌చంద్ర, డివిజన్‌ ఉద్యాన అధికారి విష్ణు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ కొప్పుల గోవిందరావు, గ్రామసర్పంచ్‌ నారగాని రాంబాయి, ఆదర్శ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ రామకృష్ణ, ఏఓ సోములపల్లి మానస, ఏఈఓలు కళ్యాణి, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement