ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిచారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు, వాహనాల వివరాలను పరిశీలించారు. సరిహద్దు రాష్ట్రం నుంచి ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. అలాగే, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
నేలకొండపల్లి: గడ్డి మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బోదులబండకు చెందిన ఎ.మధు (32) రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు నేలకొండపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి, ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా, మధు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.


