ఖమ్మంసహకారనగర్: ఎంఫార్మసీ చదువుతున్న కందిమళ్ల వైష్ణవి ఫీజులు, ఇతర అవసరాల నిమిత్తం పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్ వద్ద అందించారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్, సూరంపల్లి రాంబాబు, రుక్మారావు, విద్యార్థి తల్లి ఉషారాణి పాల్గొన్నారు.


