ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించడంపై డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను కలిసిన ఆయన సన్మానించాక మాట్లాడారు. అనాదిగా కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న నేతలతో పాటు యువతరానికి ప్రాతినిధ్యం కలిస్తూ కమిటీ ఏర్పాటు చేశారని, సామాజిక సమతుల్యతను కూడా పాటించారని ఆయన వివరించారు. అయితే, పార్టీ కోసం పనిచేసినందున మరికొందరు యువకులు, మహిళలతో రెండో జాబితా సిద్ధం చేయాలని డీసీసీ అధ్యక్షుడికి టీపీపీ చీఫ్ సూచించారు.


