న్యూస్‌రీల్
పరిశ్రమల ఏర్పాటులో మెరుగైన స్థితి
అక్షరాస్యతా శాతంలో పట్టణాలు,
అక్షరాస్యుల్లో గ్రామాలు ముందంజ
‘తెలంగాణ సోషియో ఎకనామిక్
ఔట్‌లుక్ –2025’లో వెల్లడి
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026
ఆదాయం పైకి.. స్థానం కిందకు..
తలసరి ఆదాయంలో జిల్లా రాష్ట్రంలో 18వ స్థానాన నిలిచింది. రంగారెడ్డి జిల్లా 11,29,735తో మొదటి స్థానం దక్కించుకోగా, ఖమ్మం జిల్లా రూ.2,83,744తో ఉంది. పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం రూ.3,69,420తో ఐదో స్థానాన నిలవడం విశేషం. నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రతీ వ్యక్తికి లభించే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా గణిస్తారు. ఇది ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకు దోహదపడుతుంది. అయితే గత ఏడాది జిల్లా తలసరి ఆదాయం రూ.2,49,517తో 14వ స్థానాన ఉండగా, ఈసారి ఆదాయం పెరిగినా స్థానం మాత్రం 18కి పడిపోవడం గమనార్హం.
జీడీడీపీ రూ.47,184 కోట్లు
స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ) ప్రస్తుత ధరల వద్ద 2024–25 ఏడాదికి రూ.47,184 కోట్లుగా ఉంది. ఇందులో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానాన నిలిచింది. ఏడాది కాలంలో జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మార్కెట్‌ను జీడీడీపీగా పిలుస్తారు. జీడీడీపీలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే భద్రాద్రి జిల్లా రూ.48,354 కోట్లతో ఏడో స్థానాన నిలిచింది. ఖమ్మం జిల్లా గత ఏడాది రూ.41,576 కోట్లతో 8వ స్థానంలో ఉండగా, ఈసారి కూడా అదే స్థానం దక్కింది.
అక్కడ అక్షరాస్యత.. ఇక్కడ అక్షరాస్యులు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండగా.. అక్షరాస్యత శాతం మాత్రం పట్టణ ప్రాంతంలో ఎక్కువగా నమోదైంది. జిల్లా అక్షరాస్యత 65.95 శాతం ఉంటే, గ్రామీణప్రాంతాల్లో 60.86 శాతంగానే ఉంది. ఇదే సమయాన పట్టణాల్లో అక్షరాస్యత 83.35శాతంగా ఉంది. విద్యావంతులు జిల్లాలో 8,32,320 మంది ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 5,94,262 మంది కాగా.. పట్టణ ప్రాంతాల్లో 2,38,058 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా, 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 14,01,639 మంది జనాభా ఉన్నారు. ఇందులో 10,84,811 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 3,16,828 మంది పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో అక్షరాస్యుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదైంది.
జిల్లా తలసరి ఆదాయం రూ.2,83,744


