ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, వేదపండితుల ఆధ్వర్యాన సుప్రభాత సేవ నిర్వహించాక శ్రీవారి పాదాలకు అష్టోత్తర కలశాభిషేకం చేశారు. అనంతరం శ్రీవారికి పల్లకీసేవ, పద్మావతి, అలివేలు మంగ సమేతుడైన స్వామి వారిని అశ్వవాహనంపై గిరిప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు. ఆలయ చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ముదిగొండ: ఎక్కడా లేని విధంగా ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజున రాత్రివేళ శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈనెల 27న జరిగే కల్యాణోత్సవానికి హాజరుకావాలని ప్రజాప్రతినిధులు, ఆలయ బాధ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈమేరకు హైదరాబాద్‌లో శనివారం భట్టిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. దేవస్థానం చైర్‌పర్సన్ తుళ్లూరి లత, సర్పంచ్ ఎల్.మమత, కాంగ్రెస్ నాయకులు మల్లెల అజయ్, తుళ్లూరి జీవన్, ఎల్.బుచ్చయ్య, పి.తిరపయ్య, వీరయ్య, రంగారావు పాల్గొన్నారు.
మూడో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు