39 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

39 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

Mar 21 2026 4:58 AM | Updated on Mar 21 2026 4:58 AM

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో అక్రమంగా నిల్వ చేసిన 39గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్‌ తెలిపారు. రఘునాథపాలెం మీ సేవ కేంద్రం వద్ద నిల్వ చేసిన 32 సిలిండర్లు స్వాధీనం చేసుకొని మీ సేవ ఆపరేటర్‌ జె.దుర్గారావుపై 6ఏ కేసు నమోదు చేశామని వెల్లడించా రు. అలాగే, రఘునాథపాలెంలోని సితారా హోటల్‌లో నాలుగు, ఖమ్మం ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని భవాని హోటల్‌లో మూడింటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చట్టవిరుద్ధంగా వాణిజ్య అవసరాలకు గృహోపయోగ సిలిండర్లు వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీ ల్లో డీటీ విజయ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement