కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Mar 21 2026 4:57 AM | Updated on Mar 21 2026 4:57 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం అనంతరం ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. అలాగే, శ్రీవారి వాహనరూపుడైన గరుత్మంతునికి నివేదించిన ప్రసాదాన్ని సంతానం ఆశించే దంపతులకు అందజేశారు. ఆతర్వాత మయూర వాహనంపై స్వామి, అమ్మవార్లను గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement