డీసీసీకి జంబో కార్యవర్గం! | - | Sakshi
Sakshi News home page

డీసీసీకి జంబో కార్యవర్గం!

Mar 20 2026 8:01 AM | Updated on Mar 20 2026 8:01 AM

● 79మంది పేర్లతో జాబితా విడుదల ● సీనియర్‌, జూనియర్‌ నాయకులకు స్థానం

● 79మంది పేర్లతో జాబితా విడుదల ● సీనియర్‌, జూనియర్‌ నాయకులకు స్థానం

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ జిల్లా కమిటీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్‌గౌడ్‌ గురువారం ప్రకటించగా.. జాబితాలో ఖమ్మం జిల్లా కూడా ఉంది. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల నియామకానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేశారు. కార్యవర్గంలో మొత్తం 79 మందికి చోటు కల్పించగా, ఇందులో సీనియర్‌, జూనియర్‌ నాయకులకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల చోటు దక్కేలా ఎంపిక చేసినందున క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యక్షులు : తుములూరు లక్ష్మీనరసింహారావు, మల్లెడు హైమావతి, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పసుపులేటి దేవేందర్‌, రాంపూడి రోశయ్య, పగడాల మంజుల, బుక్క కృష్ణవేణి, కాప సుధాకర్‌, మంకేన శ్రీనివాస్‌, కళ్లెం వెంకటరెడ్డి

ప్రధాన కార్యదర్శులు : వల్లూరి పట్టాభిరెడ్డి, కిలారు అనిల్‌, మహమ్మద్‌ ముస్తఫా, హుస్సేన్‌, రెంటాల ప్రసాద్‌, కంచర్ల వెంకటనర్సయ్య, పులిబండ్ల చిట్టిబాబు, కొప్పుల గోవిందరావు, కొమ్మినేని రమేష్‌, కమతాల రేణుక, ప్రభావతిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, బానోతు రామ్మూర్తి, పనిత శ్రీనివాసరావు, గోవిందు శ్రీనివాస్‌, నల్లమోతు సునీల్‌, సిరాజుద్దీన్‌, పి.సోమిరెడ్డి, మామిడి వెంకన్న, మహ్మద్‌ హఫీజుద్దీన్‌, రామసహాయం హరితారెడ్డి, ధరావత్‌ బాబు

కోశాధికారి : పులిపాటి వెంకయ్య

స్పోక్స్‌ పర్సన్లు : కాల్వకుంట్ల గోపాల్‌, కర్నాటి రామారావు, పమ్మి అశోక్‌, గంగిశెట్టి ప్రసాద్‌, బచ్చలకూర నాగరాజు నియమితులయ్యారు. అలాగే, కార్యదర్శులుగా 26 మంది, కార్యవర్గ సభ్యులుగా 15 మందికి డీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement