ఖమ్మం రాపర్తినగర్: వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధికారి టి.సునీల్‌రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుండగా, శిక్షణ పూర్తయ్యాక సెట్విన్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ ఫొటోతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 99482 07271 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
నేడు పండితాపురం
సంత వేలం
కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం)లో శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత వేలం పాట శుక్రవారం నిర్వహించనున్నట్లు సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. తొలిసారి ఈనెల 13న వేలానికి నిర్ణయించినా ఆరోజు మంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పడంతో వాయిదా వేశారు. తిరిగి 14వ తేదీన నిర్వహించినా మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడింది. ఈమేరకు శుక్రవారం సంత ఆవరణలో వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
‘సీ్త్ర జీవిత చిత్రణ’కు డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘తెలంగాణ కథా రచయిత్రులు–సీ్త్ర జీవిత చిత్రణ(1991–2015)’ అంశంపై డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ఆమె పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, తేజస్వి రాసిన కథలు, పరిశోధనాత్మక వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం కాగా, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లోనూ ఆమె పత్రాలు సమర్పించారు.


