సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Mar 17 2026 7:44 AM | Updated on Mar 17 2026 7:44 AM

ఖమ్మం సహకారనగర్‌ : ప్రజావాణిలో పలు సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మశ్రీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యలపై స్పందించాలని సంబంధిత శాఖల అదికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..

● తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కె. కిరణ్‌కుమార్‌ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్‌ భవనంలోకి మార్చాలని విన్నవించారు.

● ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలో ఉన్న ఈద్గాకు మరమ్మతులు చేయాలని, గోడ నిర్మించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రం అందించారు.

● వైరా మండలం కోష్టాల గ్రామ సర్పంచ్‌ ఇష్టానుసారంగా నర్సరీ మొక్కలు పెంచుతున్నారని, తద్వారా గ్రామానికి నష్టం జరుగుతోందని, దీనిపై చర్యలు చేపట్టాలని వార్డు సభ్యుడు వి. సాంబయ్య కోరారు.

ప్రజావాణిలో డీఆర్‌ఓ పద్మశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement