వైరా నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అసెంబ్లీలో కోరతా. ప్రధానంగా వైరాలో పాలిటెక్నిక్, కారేపల్లి డిగ్రీ కళాశాల, ఏన్కూర్‌లో ఐటీఐ, వైరాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని, వైరా రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా
నిధులు విడుదల చేయాలని కోరుతా.– మాలోతు రాందాస్‌నాయక్, వైరా ఎమ్మెల్యే
ఇల్లెందు వాసులు ప్రస్తుతం నివాసం ఉంటున్న భూమిపై హక్కులు కల్పించేందుకు జీఓ 76ను నిరంతరం అమల్లో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఆ భూమిలో సింగరేణి లీజు పూర్తయి, వందల ఏళ్లుగా ఉంటున్న వారికి హక్కులు లేవు. సింగరేణి భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి సంస్థ నుంచి ఆటంకాలు రాకుండా చూడాలని కోరుతా.
– కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే
భద్రాచలం శ్రీ సీతామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహణకు నిధులు కావాలని సీఎంను కోరుతా. అలయ అభివృద్ధి, మాఢ వీధుల విస్తరణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కొలిక్కి వచ్చినందున నిధులు త్వరగా మంజూరు చేయాలని అడుగుతా.
–తెల్లం వెంకట్రావ్, భద్రాచలం ఎమ్మెల్యే


