అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చర్చిస్తా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చర్చిస్తా

Mar 16 2026 7:29 AM | Updated on Mar 16 2026 7:29 AM

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చర్చిస్తా అభివృద్ధి నిధులు కావాలని కోరుతా.. నిధుల మంజూరుపై ప్రస్తావిస్తా

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉండాలని కోరుతా. రాష్ట్రంలో ధరణి స్థానాన తీసుకొచ్చిన భూ భారతితో ఆశించిన ప్రయోజనాలు రాలేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు, ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణపై చర్చిస్తా.

– కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే

సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా మరిన్ని నిధులు కావాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. సత్తుపల్లి ప్రజల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. అలాగే, కిష్టారం సైలోబంకర్‌ సమస్య, సింగరేణి బాధితుల ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.

– డాక్టర్‌ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే

నియోజకవర్గంలో శాశ్వత భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతా. మణుగూరు, పినపాక మండలాల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని కోరుతా.

– పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement