రఘునాథపాలెం: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని డీపీఓ రాంబాబు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆదివారం సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పది రోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న వారిని సన్మానించారు. ఈ క్రమంలో వీవీపాలెంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీపీఓ.. సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాపా ఆదినారాయణ, ఎంపీఓ శ్రీనివాస రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డీపీఓ రాంబాబు


