వేతనాలు పెండింగ్‌ ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెండింగ్‌ ఉండొద్దు

Mar 14 2026 7:30 AM | Updated on Mar 14 2026 7:30 AM

తల్లాడ: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులకు బిల్లులు, వేతనాలు పెండింగ్‌ లేకుండా చెల్లించాలనీ డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌ సూచించారు. తల్లాడ మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పథకం సమీక్షలో ఆయన మాట్లాడారు. అడిగిన ప్రతీ కూలికి పని కల్పించడమే కాక వేతనం రూ.307కు తగ్గకుండా చూడాలని తెలిపారు. తల్లాడ మండలంలో ప్రస్తుతం రోజుకు 680 మంది కూలీలే వస్తున్నందున ఈ సంఖ్య పెంచాలన్నారు. అనంతరం తల్లాడ పంచాయతీ పరిధి మంగాపురం రోడ్డులో పారిశుద్ధ్య పనులను డీఆర్‌డీఓ పరిశీలించారు. ఏపీడీ చలపతి, ఎంపీడీఓ ఏ.శ్రీధర్‌రాజు, ఎంపీఓ సురేష్‌బాబుతో పాటు ఉద్యోగులు సీ.హెచ్‌.కోటయ్య, అరుంధతి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement