పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు ఆంక్షలు

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

ఖమ్మంక్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు చేయనున్నట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ అన్నారు. ఇందులో భాగంగా కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఉదయం 8–30నుండి మధ్యాహ్నం 1–30గంటల వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని సూచించారు. ఆ మార్గంలో సభలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి ఉండదని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అంతేకాక కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా పోలీసు పెట్రోలింగ్‌ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement