ఖమ్మంవ్యవసాయం : రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’(టీజీఆర్పీడీసీఎల్)(రైతు డిస్కం) పేరిట ఏర్పాటైన ఈ సంస్థకు సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీతో పాటు నలుగురు డైరెక్టర్లను నియమించారు. వ్యవసాయ పంపు కెనెక్షన్లకు, ప్రభుత్వ నీటి సరఫరా పథకాలకు ప్రత్యేకంగా మీటర్లను ఏర్పాటు చేసి ఈ డిస్కం పరిధిలో నిర్వహించేలా విధివిధానాలు రూపొందించారు. ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో 1.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు రైతు డిస్కం పరిధిలోకి చేర్చే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 8 కేటగిరీల్లో విద్యుత్ సరఫరా అవుతోంది. మొత్తం కనెక్షన్లు ఏడు లక్షల వరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 1.20 లక్షలు కాగా, ఎత్తి పోతల పథకాలు, మున్సిపల్ నీటి సరఫరా, ఆర్‌డబ్ల్యూఎస్ వంటి నీటి సరఫరా పథకాలు 30 వేల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉచిత పథకాలు కూడా ఈ డిస్కంలోకి చేర్చే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉచిత పథకాలన్నింటినీ ఈ డిస్కంలోకి చేర్చి మిగిలిన కనెక్షన్లను(కేటగిరీలు) పాత డిస్కంలలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు
డిస్కం పరిధిలోకి..


