ఖమ్మంరూరల్ : మండలంలోని చింతపల్లి గ్రామానికి నేషనల్ వాటర్ సఫీషియల్ థీమ్ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర బృందం సభ్యుడు తారాచందర్ బుధవారం సందర్శించారు. గ్రామంలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు సైబీరియా కొంగలు సంచరించే చెరువు పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ నీటి కనెక్షన్లు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. కాగా, గ్రామస్తులు ఆయనకు బతుకమ్మలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ రాంబాబు, ఎంపీడీఓ రవికుమార్, గ్రామసర్పంచ్ మరియమ్మ, ఎంపీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


