ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన అనుంబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. అనుబంధ సంఘాలకు పట్టణ, మండల, గ్రామ కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి మరింత ఆదరణ దక్కుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండడంతోపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు సాధించినందున ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


