రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

పెనుబల్లి: తోటి ఉద్యోగి దశదిన కర్మకు వెళ్లి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన ఇది. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె వంశీ సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సహచరుడైన డ్రైవర్‌, పెనుబల్లికి చెందిన రాయల జయప్రకాష్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని దశదిన కర్మకు హాజరైన వంశీ ఎర్రగుంట్లలోని తన అత్తవారింటికి బైక్‌పై వెళ్తుండగా పెనుబల్లి మండలంలోని కొత్తగూడెం వైపు వెళ్లే జాతీయ రహదారిపై నాగమల్లేశ్వర ఆలయం వద్ద వాహనం అదుపుతప్పి డ్రెయినేజీని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108 సిబ్బంది చేరుకుని వంశీకి సీపీఆర్‌ చేస్తూ పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉన్నారు.

విద్యుదాఘాతంతో వివాహిత..

బోనకల్‌: మండలంలోని లక్ష్మీపురానికి చెందిన వివాహిత గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మి (48) రెండేళ్లుగా మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆమె భర్త రమేశ్‌ గురువారం మండల కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం వచ్చేసరికి ఆమె కింద పడి ఉండగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గుర్తించాడు. ఘటనపై వీరి కుమారుడు ఆకాష్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.వెంకన్న తెలిపారు. కాగా, లక్ష్మి మృతదేహం వద్ద సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.

గిరిజన మాల్‌తో ఉత్పత్తులకు ఆదరణ

భద్రాచలం/దుమ్మగూడెం: గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా గిరి జన మాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న గిరిజన బజార్‌కు అదనపు గదిగా రూ. 15 లక్షలతో నిర్మించనున్న గిరిజన మాల్‌కు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పపువ్వు, కరక్కాయలు , ఇతర తృణధాన్యాలు దళారులు చెంతకు చేరకుండా ఈ మాల్‌లు ఉపయోగపడతాయన్నారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనులు తయారు చేసే, పండించే ప్రతీ వస్తువు మాల్‌లో లభిస్తుందన్నారు. ఆతర్వాత దుమ్ముగూడెం మండలం నర్సాపురంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌ ఆవరణలో నీతి ఆయోగ్‌ అవార్డు నిధులతో 54మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాల విద్యార్థినుల కష్టాలు, వారి ఫలితాలపై కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ డాక్యుమెంటరీ చేయించి, నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచా రన్నారు. దీంతో రూ.3 లక్షల నగదు బహుమతి ప్రకటించగా నర్సాపురం, పర్ణశాల హైస్కూళ్ల విద్యార్థినులకు సైకిళ్లు అందించామన్నారు. కాగా, ఐటీడీఏ కార్యాలయంలో హెచ్‌ఎంలు, వార్డెన్లతో నిర్వహించిన సమీక్షలో పీఓ మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం వహించే హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏటీడీఓలు రాత్రిపూట పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి 
1
1/2

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి 
2
2/2

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement