నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటున్నా ఉదయం, సాయంత్రం చలి ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యాన వృద్ధులు, మహిళలు, పిల్లలే సాధారణ పౌరులు దగ్గు, జలుబుతో పాటు జ్వరం బారిన పడుతున్నారు. ఈమేరకు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స వివరాలు తెలుసుకునేందుకు నేరుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డి.రామారావుకు ఫోన్ చేసే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పిస్తోంది. ప్రజలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవడమే కాక సలహాలు తీసుకోవచ్చు.
తేదీ : 27–12–2025, శనివారం (నేడు)
సమయం : 10–30గంటల నుంచి 11–30 వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్
98499 02517
నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్


