అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిని
ముందుగా గుర్తిస్తే ఫలితం
మధిర: చిన్నపిల్లల్లో క్షయవ్యాధిని ముందుగానే గుర్తించాలని, తద్వారా మెరుగైన చికిత్స చేయొ చ్చని జిల్లా క్షయ నివారణ అధికారి వరికూటి సుబ్బారావు తెలిపారు. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు చొరవ చూపాలని సూచించారు. మధిర మండలం దెందుకూరు, మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మధిర పరిధిలోని ప్రసూతి సేవల కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మా ట్లాడుతూ.. చిన్నపిల్లల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్షయ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు పృథ్వీరాజ్‌నాయక్, వీరబాబు, రామ్మోహన్‌నాయక్, ఉద్యోగులు శైలజ, వి.వెంకటేశ్వర్లు, శరత్, సందీప్, లంకా కొండయ్య, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జనరల్ ఆస్పత్రిలో
పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రిని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌ఆర్‌సీ (పోషకాహార పునరుద్ధరణ కేంద్రం), ఎంసీహెచ్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌తో సమావేశమై ఆస్పత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య వివరాలపై సమీక్షించారు. ఎన్‌ఆర్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, బయో మెడికల్ ఇంజనీర్ రెడ్యా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జ్యోతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !


