పథకాల అమలులో అగ్రభాగాన వ్యవసాయ శాఖ
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా వ్యవసాయ శాఖ ముందంజలో నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతీ నెల ర్యాంకులు కేటాయిస్తుండగా ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలిచింది. మొత్తం 12 అంశాలకు గాను.. ఒక్కో అంశానికి పది మార్కుల చొప్పున 120 పాయింట్లకు జిల్లాకు 97.67 పాయింట్లు దక్కాయి. పంట నమోదు, పీఎం కిసాన్ ఈకేవైసీ, రైతుబీమా అమలు, రికార్డుల నిర్వహణ, యూరియా, ఎరువుల పరిశీలన, రైతునేస్తం, సాయిల్ హెల్త్‌కార్డ్స్ తదితర అంశాల ప్రామాణికంగా ఈ పాయింట్లు కేటాయించారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలవగా అభినందించారు.


