గార్లొడ్డు దేవాలయంలో విజయవాడ జడ్జి పూజలు | - | Sakshi
Sakshi News home page

గార్లొడ్డు దేవాలయంలో విజయవాడ జడ్జి పూజలు

Nov 9 2025 6:55 AM | Updated on Nov 9 2025 6:55 AM

గార్ల

గార్లొడ్డు దేవాలయంలో విజయవాడ జడ్జి పూజలు

ఏన్కూరు: మండలంలోని గార్లొడ్డు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విజయవాడ కోర్టు జడ్జి సునీత – శ్రీనివాసరావు దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా వారు దీపాలు వెలిగించి కుంకుమ పూజ నిర్వహించారు. పదేళ్లుగా స్వా మిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. తొలుత జడ్జి దంపతులను అర్చకులు బీటకూరి వేణుగోపాలాచార్యులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతించి, పూజల అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

‘సిద్ధి’వరి రకం క్షేత్ర ప్రదర్శన

తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో శనివారం ‘సిద్ధి’(వరంగల్‌ 44) వరిరకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రవ్యవ సాయ శాఖ ద్వారా విడుదల చేసిన ఈ విత్తనాలతో గ్రామానికి చెందిన ఐలూరి కోటిరెడ్డి పంట సాగు చేశారు. ఈ సందర్భంగా రైతులతో క్షేత్రాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు మాట్లాడా రు. ఈ విత్తనం చౌడు, ఉల్లికోడును తట్టుకుంటుందని, వానాకాలం సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె.హేమంత్‌కుమార్‌, వైరా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ వి.చైతన్య, డాక్టర్‌ టి.పావని, రైతులు పాల్గొన్నారు.

టీవీఎస్‌ కంపెనీకి

రూ.60 వేల జరిమానా

వాహనం లోపాలపై ఫిర్యాదుతో తీర్పు

ఖమ్మంలీగల్‌: వాహనంలో సమస్యలను పరి ష్కరించకుండా వినియోగదారుడిని ఇబ్బందికి గురిచేశారంటూ టీవీఎస్‌ ద్విచక్రవాహనాల కంపెనీకి జరిమానా విధిస్తూ ఖమ్మంజిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తీర్పు ఇచ్చింది. కమిషన్‌ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవీలత శనివారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మానికి చెందిన రామిశెట్టి నితిన్‌విజేత హైదరాబాద్‌ మలక్‌పేటలోని షోరూంలో టీవీఎస్‌ అపాచీ ద్విచక్ర వాహనాన్ని 2021 మేలో రూ.2,65,234తో కొనుగోలు చేశాడు. కొంతకాలా నికి సమస్యలు వస్తుండడంతో షోరూమ్‌ నిర్వాహకులను ఆశ్రయించినా ఫలితం కానరాలేదు. దీంతో న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్‌, కొలి కొండ శరత్‌బాబు ద్వారా ఖమ్మంజిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసుదాఖలు చేశాడు. సాక్షాలు, పూర్వాపరాలను పరిశీలించాక వాహనం సరైన రీతి లో ఉండేలా అవసరమైన పరికరాలు ఉచితంగా అందజేయాలని కమిషన్‌ ఆదేశించింది. అంతేకాక రూ.50వేల జరిమానా విధించడంతో పాటు ఫిర్యా దుదారుడి మానసిక వేదనకుగాను మరో రూ.10 వేలు 45రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో వెల్లడించింది.

గార్లొడ్డు దేవాలయంలో విజయవాడ జడ్జి పూజలు 
1
1/1

గార్లొడ్డు దేవాలయంలో విజయవాడ జడ్జి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement