ఓటమే గెలుపునకు నాంది
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● ముగిసిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
వైరా: ప్రతీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపు సొంతమవుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒకేసారి వచ్చే విజయం కాకుండా ఓటమి ద్వారా వచ్చేదే కలకాలం నిలుస్తుందని చెప్పారు. వైరాలోని బాలికల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న గురుకులాల 11వ జోనల్ స్థాయి క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఈ మేరకు విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తుండడం అభినందనీయమని తెలిపారు. ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన మహిళా జట్టును స్ఫూర్తిగా తీసుకుని విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల మల్టీజోనల్ ఆఫీసర్ ఎం.అలివేలు, జోనల్ ఆఫీసర్ విద్యారాణి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సమత, జిల్లా కన్వీనర్ కె.రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
రెండు విభాగాల్లో చాంపియన్‌గా ఇల్లెందు
వైరా గురుకులంలో అండర్–14, 17, 19 విభాగా ల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. జోనల్ పరిధి గురుకులాల నుంచి 1,190 మంది క్రీడాకారులు పాల్గొనగా ఓవరాల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండర్, 17, 19 విభాగాల్లో ఇల్లెందు గురుకులం విద్యార్థిను లు చాంపియన్‌గా నిలిచారు. అండర్–14 విభాగంలో వైరా గురుకులానికి ట్రోఫీ దక్కింది. అలాగే, వ్యక్తిగతంగా అండర్–17లో టి.రేష్మ(వైరా), అండర్–19లో ఎన్.సవిత (ఇల్లెందు) ట్రోఫీ గెలుచు కున్నారు. అలాగే, అండర్–17 ఖో–ఖో పోటీల్లో అడవిమల్లెల, కూసుమంచి, వాలీబాల్‌లో ములకలపల్లి, దానవాయిగూడెం, టెన్నీకాయిట్‌లో దానవాయిగూడెం, వైరా జట్టు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. డిస్కస్ త్రోలో ఎన్.వెన్నెల (భద్రాచలం), వి.తప్సవి (నేలకొండపల్లి), టి.రేష్మ(వైరా) మొ దటి స్థానాలు దక్కించుకోగా, అండర్–19 వాలీవాట్‌లో పాల్వంచ, దానవాయియిగూడెం, బాల్‌బ్యాడ్మింటన్‌లో వైరా, మధిర, కబడ్డీలో ములకలపల్లి, అంబేడ్కర్ కళాశాల, ఖో–ఖోలో ములకలపల్లి, అంబేడ్కర్ కళాశాల మొదటి రెండు స్థానాల్లో నిలిచా యి. డిస్కస్ త్రోలో డి.పావని (దానవాయిగూడెం), ఎ.అంజలి (నేలకొండపల్లి), బి.రూప (నేలకొండపల్లి), హైజంప్‌లో ఎన్.సరిత (ఇల్లెందు), బి.సంజన (ఇల్లెందు), డి.పూజశ్రీ (ములకలపల్లి), షాట్ పుట్ అండర్–17లో డి.భార్గవి(అడవిమల్లెల), ఎస్.భార్గవి(వైరా), వి.మేధావర్షిత(కూసుమంచి), విజయం, షాట్‌పుట్ అండర్–19 విభాగంలో టి.ఉమారాణి(అడవిమల్లెల), డి.శ్వేత(కూసుమంచి), కె.సంజన(ఎర్రుపాలెం) మొదటి మూడుస్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.


