
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కుంచం సందీప్ (16) శనివా రం మృతిచెందాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దస రా సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఇటీవల గడ్డిమందు తాగాడు. దీంతో గుర్తించిన ఆయ న తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు.
ఉరి వేసుకుని బలవన్మరణం
కారేపల్లి: మానసిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన మాలోతు తావుర్యా – లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్ (25) రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరు ప్రాంతంలో పనులకు వెళ్లిన ఆయన దసరాకు ఇక్కడకు వచ్చి మళ్లీ వెళ్లాడు. తిరిగి ఈనెల 17వ తేదీన స్వ గ్రామానికి వచ్చిన సాయికుమార్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. తల్లి లక్ష్మి అస్వస్థతకు గురికాగా ఆమెను చికిత్స నిమిత్తం తావుర్యా ఖమ్మం తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం వరకు స్నేహితులతో గడిపిన సాయికుమార్ ఉన్నట్టుండి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు తలుపు పగలకొట్టి సాయికుమార్‌ను ఇల్లెందు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.