
‘సాక్షి’పై కుట్రలు సరికాదు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న
ఏపీ ప్రభుత్వం
కూసుమంచి నిరసనలో నాయకులు
కూసుమంచి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను కాలరాసేలా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాసమస్యల ను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’పత్రికతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్నికాలరాస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం పాలేరు నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలో నిర్వహించిన ఆందోళనలో జర్నలిస్టులు, వివిధపార్టీలు, సంఘాల నా యకులుపాల్గొన్నారు. న్యూడెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకట్రామిరెడ్డి, టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోలంపల్లి నాగేశ్వరరావుమాట్లాడుతూ.. సమాజానికి పత్రికలుమూల స్తం భాలుగా నిలుస్తుండగా వాస్తవాలను వెలికితీసే హక్కు ఉందని తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సాక్షి మీడియా, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని, మీడియా గొంతు నొక్కితే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.కాంగ్రెస్,బీఆర్‌ఎస్, ఎన్‌డీ, సీపీఎం నాయకులు ఎండీ హఫీజుద్దీన్, ఎండీ కలీమ్,బాబునాయక్, ముత్తేశం, సైదానాయక్, వెంక న్న, చంద్రయ్య, బానోతుఉపేందర్, అద్దంకికోటయ్య, మల్లీడువెంకటేశ్వర్లు, ఉపేంద్రాచారి, సండ్ర బజారు, చెరకుపల్లివీరయ్య, బత్తులఉప్పలయ్య, ఎడవెల్లి రమ ణారెడ్డి, కొక్కిరేణి వీరస్వామి, వివిధ పత్రికల జర్నలిస్టులు, ఉద్యోగులు చాగంటి వెంకటేశ్వర్లు, మల్లెల ఉపేందర్, వాచేపల్లి హనుమంతరెడ్డి, పెంటమళ్ల కోట య్య, మెగిలి రామకృష్ణ, పందిరి వెంకటరెడ్డి, ఎండీ రంజాన్‌అలీ,మందులనాగరాజు, అత్తలూరి హనుమం తరావు,వడ్లమూడి వెంకటేశ్వర్లు, పోలేటి నారాయణ, గంధం రాంచందర్‌రావు, రాము, పడిశాల వెంకన్న, రాంబ్రహ్మం,వెంకటేశ్వర్లు, కర్ణబాబుపాల్గొన్నారు.