ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక

Oct 20 2025 9:14 AM | Updated on Oct 20 2025 9:14 AM

ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక

ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–17 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు 40 మంది బాలలు, 30 మంది బాలికలు హాజరు కాగా.. వివిధ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికల ప్రక్రియను జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి వై.రామారావు, బాస్కెట్‌బాల్‌ కోచ్‌లు పీ.వీ.రమణ, కృష్ణమూర్తి, రామారావు, భరత్‌చంద్ర పర్యవేక్షించారు.

జట్లు ఇవే...

అండర్‌–17 బాలుర బాస్కెట్‌బాల్‌ జట్టుకు అక్కి ఆయాన్‌, కె.స్నేహిత్‌, యశ్వంత్‌, హర్షవర్ధన్‌, సాత్విక్‌, సుమంత్‌, జెస్సు కిరణ్‌, చరణ్‌, సూర్య, గౌతమ్‌ సాహూ, ఎం.సాకేత్‌, రేహాన్‌, రైసింగ్‌, ఎస్‌.సాకేత్‌, అభినవ్‌, విశ్వతేజ, చత్రపతి శివాజీ, ఎండీ.గౌస్‌ అస్లాం ఎంపియ్యారు. అలాగే, బాలికల జట్టులో పి.అఖిల, రిశివశ్రీ, పూనం హన్సీ, సహస్ర, ఓంకారుణ్య, ఆయుషాన్ని, కీర్తి స్వప్నిక, తమన్‌ వి.తమరిత, చందనశ్రీ, దీక్షిత, యక్షిత, సాత్విక, ధతి, మనస్విని, కీర్తన, బి.హరిణి, కె.రితికాశాస్త్ర, కె.గ్రేస్‌కు స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement