
హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మంరూరల్: నాగ్‌పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్‌లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు. మార్కెట్ ధర కంటే మూడింతలు రెట్టింపు పరిహారం చెల్లిస్తేనే భూమి ఇస్తామని తెలిపారు. రైతుల ఆందోళనతో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు వెనుదిరిగారు. అనంతరం రైతులతో రెవెన్యూ అధికారులు చర్చించగా, పరిహారంపై తేల్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు వేములపల్లి సుధీర్, రాధాకృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, అనంతిని శ్రీనివాస్, శ్రీధర్, రఘు, పాటి వెంకటయ్య, ఉపేందర్‌రావు, రంగారావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.