
ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్
బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్‌కే నారాయణ్, ఎన్‌రిచ్‌మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్‌లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. కాగా, నారాయణ ప్రస్తుతం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా డు. అంతేకాక సొంత ఇన్‌స్టిట్యూట్ ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించారు.
26న సింగరేణి ఆధ్వర్యాన జాబ్‌మేళా
సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున గ్రామంలో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే, సైలో బంకర్ నుంచి వాయు కాలుష్యం వెలువడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, చల సాని సాంబశివరావు, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు పాల్గొన్నారు.
టీటీడీ ఆలయ ప్రతిపాదిత స్థలంలో పనులు
ఖమ్మంఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ఖమ్మం 15వ డివిజన్ అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో శనివారం చెట్ల తొలగింపు పనులను ప్రారంభించారు. ఇక్కడ సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించగా ఇటీవల దేవాదాయ శాఖ స్థపతి, అధికారులు పరిశీలించారు. అయితే, కంపచెట్లు తొలగించి భూమిని చదును చేస్తే పూర్తిస్థాయి స్వరూ పం తెలుస్తుందన్న సూచనలతో పనులు మొదలుపెట్టారు. వీ.వీ.పాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు, నాయకులు పత్తిపాటి వీరయ్య, గౌని గోవర్దన్, పత్తిపాటి అప్పారావు, పత్తిపాటి వెంకటేశ్వర్లు, యనిగండ్ల సత్యనారాయణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సనగండ్ల ఉపేందర్‌రావు, సామినేని సైదులు, ముత్తయ్య, గుండె ఆదినారాయణ, దమ్మాలపాటి సైదులు పాల్గొన్నారు.
బందోబస్తును
పరిశీలించిన సీపీ
ఖమ్మంక్రైం: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం బంద్‌కు పిలుపునివ్వగా.. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు. బందోబస్తుపై ఆరాతీసిన ఆయన శాంతిభద్రతల కు విఘాతం ఏర్పడకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీమా పరిహారం
చెల్లించాల్సిందే..
ఖమ్మంలీగల్: ఆరోగ్య బీమా పథకంలో పాలసీ తీసుకున్న వారికి చికిత్స ఖర్చులు చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత తీర్పు చెప్పారు. రెండు కేసుల్లో శనివారం వెలువరించిన తీర్పుల వివరాలిలా ఉన్నాయి. మధిర మండలానికి చెందిన బలగం జయమహేశ్వరనాయక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి 2021లో రూ.15,287 చెల్లించి ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5.50 లక్షల పరిమితితో ఈ పాలసీ తీసుకోగా, కొన్నాళ్లకే మహేశ్వరనాయక్ కరోనా బారిన పడితే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సచేయించుకున్నాడు. ఆయనవైద్యం బిల్లులు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయిస్తే క్లెయిమ్ నిరాకరించారు. దీంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, కొలికొండ శరత్‌బాబు ద్వారా కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు చికిత్సకు అయిన రూ.94,945తో పాటు వేదనకు గురిచేసినందుకు రూ.10వేలు, ఖర్చుల కింద రూ.10వేలను 45రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించారు. అలాగే, బలగం స్వరూపారాణి దాఖలు చేసిన కేసులో ఆమె చికిత్సకు అయిన రూ.71,245తో పాటు మనోవేదన, ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు.

ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్

ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్